లండన్ : ఆక్స్ఫర్డ్ టీకా ఆశల్ని చిగురింప చేస్తోంది. గత నెలలో తొలి విడతగా వెయ్యి మందిపై టీకాను ప్రయోగాత్మకంగా పరీక్షించి చక్కటి ఫలితాల్ని సాధించారు. రెండో విడత పరీక్షలకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా 10,260 మందిపై టీకాల్ని పరీక్షించనున్నారు. తొలి విడతలో టీకా సురక్షితను పరిశీలించారు. రెండో దశలో ఈ టీకా వల్ల వృద్ధుల్లో రోగ నిరోధక వ్యవస్థ స్పందన గురించి పరిశీలిస్తారు. బాధితులకు కల్పించే రక్షణ, తదితరాల్ని పరిశీలించనున్నట్టు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ అధిపతి ఆండ్రూ పొలార్డ్ తెలిపారు.