అంవతి శ్రీనివాస్‌పై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు..

మెగా బ్రదర్‌ నాగబాబు ట్విట్టర్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి అంవతి శ్రీనివాస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కొద్ది రోజుల క్రితం విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో కొంతమంది మృత్యువాత పడగా వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.దీంతో ఆయా గ్రామాల్లో ప్రజల భయాన్నితొలగించడంతో పాటు,ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులను గ్రామాల్లో నిద్ర చేయాలని ఆదేశించారు.దీంతో మంత్రి అవంతి శ్రీనివాస్‌ సైతం పద్మనాభాపురంలో నిద్ర చేశారు.ఆ సమయంలో గ్రామంలోని రెండు ఆవులకు గడ్డి తినిపించడానికి ప్రయత్నించగా అవి రెండు విముఖత చూపి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాయి.అందుకు సంబంధించి ఫోటోలు,వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ‘అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను‘ నాగబాబు ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos