ముస్లింలకు రంజాన్ కానుకల అందజేత

ముస్లింలకు రంజాన్ కానుకల అందజేత

హోసూరు : ఇక్కడికి సమీపంలోని అచ్చెట్టిపల్లి గ్రామంలో గల 100 మంది ముస్లిం కుటుంబాలకు పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి రంజాన్ కానుకలు అందజేశారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. అందులో భాగంగా హోసూరు యూనియన్ అచ్చెట్టి పల్లి గ్రామంలో ఉన్న 100 మంది పేద ముస్లిం కుటుంబాలకు అచ్చెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి రంజాన్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమానికి హోసూరు యూనియన్ చైర్పర్సన్ శశి వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై, రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హోసూరు యూనియన్ బీడీవో, అచ్చెట్టిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos