‘ట్రంప్‌…కుక్క మలమూత్రాలు పూసుకుంటాడు’

‘ట్రంప్‌…కుక్క మలమూత్రాలు పూసుకుంటాడు’

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుక్క మలమూత్రాలు పూసుకు తిరిగే పిల్లాడు లాంటి వాడని స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్ ఎంఎస్ఎన్బిసి టెలివిజన్ హోస్ట్ జియో స్కార్బరోను సైకో లాంటి వాడని వ్యాఖ్యానించారు. ‘ట్రంప్ కుక్కు మలమూత్రాలను పూసుకు తిరిగే పిల్లవాడు లాంటివాడు. తనతో పాటు ఉన్న అందరికీ కూడా పూస్తాడు. ఒక్కసారి అది పూసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంద’ని పెలోసీ తీవ్రంగా ప్రతిస్పందించారు. పెలోసీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారు. ఈమెకు, ట్రంప్కు అస్సలు పడదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వేసుకుంటానని ట్రంప్ చెప్పినప్పుడు పెలోసీ ఆయన ఊబకాబం గురించి ప్రస్తావించారు. దీనిపై ట్రంప్ ఎదురు దాడికి దిగారు. ‘పెలోసీ రోగిష్టి. , ఆమెకు అనేక సమస్యలున్నాయి. మానసిక వ్యాధి కూడా ఉంద’ని హేళన చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos