శివమొగ్గ:పీఎం కేర్స్ ఫండ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా గురువారం ఇక్కడి పోలీసులు ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసారు. పీఎం కేర్స్ ఫండ్ విరాళాలు దుర్వినియోగమవుతున్నాయని సోనియా గాంధీ, తదితరులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ట్వీట్లు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. పీఎం కేర్స్ విరాళాలను ప్రజల కోసం కాకుండా ప్రధాని విదేశీ యాత్రలకు ఖర్చు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సోనియా గాంధీ పైనా, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలపైనా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.