గాడ్సే కథాంశంతో సినిమా తీస్తా..

  • In Film
  • May 21, 2020
  • 169 Views

వివాదం లేనిదే కనీసం తిండికూడా సహించని దర్శకుడు ఆర్జీవీ ఏరికోరి మరీ వివాదాల జోలికి వెళతాడు.ఇప్పటికే ఈ విషయం అనేకసార్లు రుజువు కాగా తాజాగా మరోసారి ఈ విషయం రుజువు చేసుకున్నాడు.గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు మద్దతిస్తూ ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నాథూరాం గాడ్సే.. గాంధీని చంపాడని మాత్రమే చెబుతున్నారు. కానీ ఎందుకు చంపాడో అనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు. గాంధీని గాడ్సే ఎందుకు చంపాడనే విషయం తెలియకపోవడం వల్లే అతడు విలన్‌గా మారిపోయాడు. గాడ్సే మామూలుగా గాంధీకి ఫాలోవర్. స్వాతంత్రం వచ్చేసింది. భారత్-పాక్ విడిపోయాయి. గాడ్సే కోరుకున్న రెండూ జరిగిపోయాయి.అయినా కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ విషయాన్ని అప్పటి ప్రభుత్వం బయటకు రానివ్వలేదు. ఎందుకంటే ఆ టైమ్‌లో అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది. గాంధీని జాతిపిత అని చెప్పాం. దాని తర్వాత ఆయన హత్యకు గురయ్యారు. అలాంటి పరిస్థితిలో గాంధీని ఎందుకు చంపారనే విషయాన్ని బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదని భావించి తొక్కిపెట్టారు. ఏది ఏమైనా గాడ్సే దేశభక్తి విషయంలో నాగబాబు గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తా’నని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా… గాడ్సే కథాంశంతో తాను సినిమా తీయబోతున్నట్లు ఓ బాంబ్ పేల్చాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos