పరీక్షల్లో నెగిటివ్..అయినా కరోనా క్యారియర్లు..

పరీక్షల్లో నెగిటివ్..అయినా కరోనా క్యారియర్లు..

రోజురోజుకు ప్రపంచమంతా దావాలనంలా వ్యాపిస్తున్న కరోనా ఒక్కో దేశంలో ఒక్కోలా రూపు మార్చుకొని మరణ శాసనం లిఖిస్తోంది.దీంతో కరోనాకు వ్యాక్సిన్‌ల తయారీ చాలా క్లిష్టతరంగా మారింది.ఇదిలా ఉంటే తాజాగా కరోనా లక్షణాల్లో సైతం పెను మార్పులు సంభవిస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో వైరస్ వ్యాపించి శరీరంలోనే ఉంటుంది. కానీ లక్షణాలను బయటకు కనిపించడం లేదు. అంటే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారిలో వైరస్ ప్రవేశించినా లక్షణాలు ఉండడం లేదు. ఇదే ప్రధాన కారణం వైరస్ ఇతరులకు వ్యాపించడానికి కారణమవుతోంది. ఎందుకంటే వైరస్ ప్రవేశించిన వ్యక్తి లక్షణాలు లేవని సాధారణంగా జీవిస్తుంటాడు. దీంతో అతడి వలన ఇతరులకు వ్యాపించనుంది. వూహాన్ నగరానికి చెందిన 20 ఏళ్ల అమ్మాయికి పరీక్ష చేస్తే మాయదారి రోగం వచ్చిన దాఖలాలు లేవు. పరీక్షలు చేసినా నెగిటివ్ ఫలితమే వచ్చే పరిస్థితి.కానీ.. ఆమె ద్వారా మరో ఐదుగురికి వ్యాపించిన వైనం సైంటిస్టులకు ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. ఇలాంటి తీరు ప్రపంచంలో తొలిసారి ప్రదర్శించింది మాత్రం వూహాన్ నగరానికి చెందిన అమ్మాయే. ఆమె తరహాలోనే పలువురు పైకి నెగిటివ్ ఉన్నా.. వారి ద్వారా మాత్రం పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంఖ్య ఎక్కువ అవుతోంది. తరహా కేసులకు మూలమైన వూహాన్ అమ్మాయి మిస్టరీగా మారటమే కాదు.. సైంటిస్టులకు సవాలుగా మారింది.ఇలా చైనా దేశంలో 17 కొత్త కేసులు నమోదైతే.. వాటిలో 12 కేసుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినా వారికి వైరస్ వ్యాపించింది.అలా జరగడానికి ప్రధాన కారణం సోకిన వ్యక్తికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండి ఉంటుంది. వీరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా చెయిన్ తెంచాలంటే ఒకటే పరిష్కారం. వీలైనంత ఎక్కువ పరీక్షలు చేయడం అత్యుత్తమ మార్గం. మన దేశంలోనూ ఇలాంటి లక్షణాలు లేని కేసులు అధికంగా నమోదయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను ఐసీఎంఆర్ అప్రమత్తం చేస్తోంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos