నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజున నారా లోకేష్ పుట్టడం సంతోషమని సినీనటి దివ్యవాణి అన్నారు. పుట్టినరోజున కూడా రాష్ట్రం కోసం దావోస్‌లో పని చేస్తుండడం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పొందిన స్ఫూర్తికి నిదర్శనమన్నారు. చిన్న వయస్సులో నిత్యం కష్టపడుతున్న లోకేష్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని దివ్యవాణి చెప్పారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అభినందనీయమని, అన్ని వర్గాలకు సంక్షేమ పధకాలు అద్భుతంగా కొనసాగుతున్నాయని, చంద్రబాబు లాంటి నేత మనకు దొరకడం అదృష్టమని దివ్యవాణి తెలిపారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.