గత ఏడాది వెస్టీండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టు సారథి విరాట్ కొహ్లీ, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ మధ్య జరిగిన వివాదం అందరిలోనూ ఆసక్తి రేపింది.విలియమ్స్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన ప్రతిసారి కొహ్లీ నోట్‌బుక్ సైగలు చేస్తూ విలియమ్స్‌ను రెచ్చగొట్టాడు.అయితే కొహ్లీ అలా ఎందుకు చేశాడో విలియమ్స్ తాజాగా వివరించాడు. జమైకాలో జరిగిన వన్డేలో విరాట్ కోహ్లీ వికెట్ తీసినప్పుడు.. తొలిసారి నోట్‌బుక్ సంబరాలు జరుపుకొన్నా. అది అభిమానుల కోసం చేసిందే. కానీ కోహ్లీ మాత్రం ఆ కోణంలో చూడలేదు. మ్యాచ్ అయ్యాక అతడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు నీ బౌలింగ్ బాగుందన్నాడు. ఆ సమయంలో కోహ్లీ అసభ్యంగా ప్రవర్తించలేదు. అది అంతటితో ముగిసింది’ అని విలియమ్స్ తెలిపాడు. 2019లో విండీస్ జట్టు భారత పర్యటనకు రాగా.. హైదరాబాద్‌లో జరిగిన తొలి టీ20లో కోహ్లీ క్రీజులోకి వస్తూనే ఈ రాత్రి నీ నోట్‌బుక్ సంబరాలకు నేను అవకాశం ఇవ్వనని నాతో అన్నాడు. అలా ప్రతీ బంతికి ఏదో ఒకటి అంటూనే నన్ను రెచ్చగొట్టాడు. అందుకే.. ‘ఫ్రెండ్, నోరు మూసుకొని బ్యాటింగ్ కొనసాగించు. నీ ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉంది అని చెప్పా. కానీ కోహ్లీ అందులో సగమే విన్నాడు’ అని వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ పేర్కొన్నాడు. ఆ రాత్రి విరాట్ నన్ను లక్ష్యంగా చేసుకుని చితక్కొట్టాడు. ఆ క్రమంలోనే నా శైలిని అనుకరిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు భారతదేశమంతా వార్తాపత్రికలలో ఆ సెలబ్రేషన్ గురించే రాశారని చెప్పుకొచ్చాడు.