మహేష్ బాబు చాలా కాలం నుంచి డైరెక్టర్ రాజమౌళితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మొత్తానికి ఒక కథ సెట్టవ్వడంతో మహేష్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. జేమ్స్ బాండ్ తరహాలో ఆ సినిమా ఉంటుందట. మహేష్ పాత్ర సీరియస్ గా ఉంటుందని ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వినిపిస్తోంది.మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ పై జనాలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినప్పటికీ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నెల 31న మహేష్ తన తండ్రి కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. సినిమాను ఎనౌన్స్ చేసి ఆ తరువాత ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రాజమౌళి ఇది ముగిసిన వెంటనే మహేశ్ చిత్రాన్ని మొదలుపెట్టనున్నట్లు టాక్. ఈ సినిమా కోసం రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు సినిమా కోసం 300 కోట్ల బడ్జెట్ ను కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.