న్యూ ఢిల్లీ: గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2553 కరోనా కేసులు దాఖలయ్యాయి. సోమ వారం ఉదయానికి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 42,533కు చేరింది. 1373మంది మృత్యువాత పడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 11,707మంది కోలుకోగా, 29,453 ; మంది చికిత్స పొందుతున్నారు. 11 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్వెల్లడించింది.