చిత్తూరు: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు మనోహర్ కు వ్యతిరేకంగా వైకాపా నేత విద్యాసాగర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి దేవస్థానానికి చెందిన ఫిక్సిడ్ డిపాజిట్లపై రూ.12 లక్షలు రుణాన్ని తీసుకుని స్వాహా చేశాడని ఫిర్యాదులో ఆరోపించారు. తన పేరుమీద మనోహర్ రుణాలు తీసుకున్నారని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారానికి ముందే కుప్పం టౌన్ బ్యాంకులో రూ. కోటి 90 లక్షల భారీ అవినీతి జరిగింది. కొందరు ప్రముఖులు ఫిక్సిడ్ డిపాజిట్లపై లో రుణాల్ని తీసుకుని స్వాహా చేసినట్లు ఫిర్యాదులు దాఖల య్యాయి. మేనేజర్, అప్రయజర్ మరో ఇద్దరు సిబ్బందితో కలిసి ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. దీంతో నలుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతా ధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దరిమిలా మనోహర్‌కు వ్యతిరేకంగా విద్యాసాగర్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.