తిరోగమనంలో చైనా అర్థిక వ్యవస్థ

తిరోగమనంలో చైనా అర్థిక వ్యవస్థ

బీజింగ్: కరోనా వైరస్ చైనా ఆర్థిక వ్యవస్థను భారీ స్థాయిలో కుంగదీసింది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆ దేశ వృద్ధిరే టు దశాబ్దాల కనిష్ఠానికి దిగజారింది. గత మూడు నెలల కాలంలో వైరస్ విజృంభణతో కొనసాగిన కఠిన ఆంక్షలే దీనికి కారణమని నివేదికలు స్పష్టం చేశాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా వృద్ధి రేటు మార్చితో ముగిసిన త్రైమాసికంలో 6.8శాతం కుచించుకుపోయిందని అధికారిక నివేదిక వెల్లడించింది. గతంలో నిపుణులు అంచనా వేసిన 16 శాతం వృద్ధిరేటు కోత కంటే ఇది మరీ ఎక్కువ అని స్పష్టమవుతోంది. 1979లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారని నిపుణులు తెలిపారు. వైరస్ అదుపులోకి వచ్చిన నెల రోజుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అంచనా వేసిన ఆర్థికవేత్తలు సైతం తమ నివేదికల్ని వెనక్కి తీసుకుంటున్నారు. వ్యాపార, రిటైల్ విక్రయాల వృద్ధి ఊహించిన దానికంటే భారీగా తగ్గిందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడడానికి తొలుత అంచనా వేసినదానికంటే ఎక్కువ సమయం పడుతుందని స్పష్టం చేశారు. అలాగే, ఇది ఊహించినంత సులువు కూడా కాదని అభిప్రాయపడ్డారు. వాహన విక్రయాలు 48.4శాతం, ఎగుమతులు 6.6శాతం, రిటైల్ వ్యయాలు, ఇతర స్థిర పెట్టుబడులు 16.1శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos