గరిటె తిప్పిన రాంచరణ్

  • In Film
  • April 16, 2020
  • 141 Views

హైదరాబాద్: టాలీవుడ్ అగ్రకథానాయకుడు రాంచరణ్ వంటింట్లో గరిట తిప్పారు. కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. తమ ప్రియమైన వారితో సరదాగా గడుపుతున్నారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి సేద తీరుతున్న వీడియోలను సైతం ఎప్పటికప్పుడూ సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్చరణ్ తన సతీమణి ఉపాసన కోసం రాత్రి భోజనాన్ని తయారు చేశారు. అంతేకాకుండా వంట పూర్తయ్యాక కిచెన్ను సైతం శుభ్రం చేశారు. రామ్చరణ్ వంటగదిలో గరిట తిప్పుతున్న వీడియోను ఉపాసన ట్విటర్ వేదికగా నెట్టింట్లో పోస్ట్ చేసింది. ప్రియమైన సతీమణి కోసం రామ్చరణ్ డిన్నర్ తయారు చేస్తున్న వేళ. ఆయనే డిన్నర్ను సిద్ధం చేశారు. అలాగే డిన్నర్ పూర్తయ్యాక అంతా శుభ్రం చేశారు. మీకోసం ఎప్పుడూ శ్రమించే మీ భార్యలను ప్రేమగా చూసుకోవాల్సిన సమయమిది. ఆయనే నా హీరో కావడానికి కారణమిదే..!’ అని ఉపాసన పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. రామ్చరణ్ వంటగదిలో గరిట తిప్పడం ఇది మొదటిసారి కాదు. ఆయన ఇప్పటికే చాలా సందర్భాల్లో తన కుటుంబసభ్యుల కోసం పలు రకాలైన వెజ్, నాన్వెజ్ వంటలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos