శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వితరణ

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వితరణ

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సేవాతత్పరతను చాటుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో పది వేల పేద కుటుంబాల గడపగడపకు 5 కిలోల బియ్యం, దోసకాయలు, నిమ్మకాయలు, కందిపప్పు సహా సి విటమిన్ టాబ్లెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. 60 వేల మందికి ఈ సరుకులను పంపిణీ చేయాలని లక్ష్యం విధించుకున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి రూ.కోటికి పైగా సొంత నిధులను ఖర్చు చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో సుమారు 50 టన్నుల బియ్యాన్ని 28 ట్రాక్టర్లలో ర్యాలీగా తీసుకొచ్చి పేదలకు పంపిణీ చేశారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు భారీగా విరాళాలిచ్చిన పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, ప్రముఖుల ఫ్లెక్సీలను తయారు చేయించి ఊరేగింపును నిర్వహించడం ద్వారా వారి సేవలను కొనియాడారు. ప్రస్తుత తరుణంలో కరోనాపై విజయం సాధించడానికి ప్రజలు ఏకతాటిపై నిలవాలని, సొంత ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యాలను కాపాడడానికి జాగ్రత్తలు పాటించాలని మధుసూదన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos