హైదరాబాదు: లాక్ డౌన్ కారణంగా దేశంలో కోట్లాది మంది ఉపాధిని కోల్పోతున్నందున పద్ధతి ప్రకారం లాక్ డౌన్ ను క్రమంగా సడలించాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విన్నవించారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు జరపాలని సూచించారు. విదేశాల్లోనే ఎక్కువగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. 60 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని అన్నారు. 130 కోట్ల జనాభాలో 200 మంది మరణించడం పెద్ద సంఖ్య కాదన్నారు.