అమూల్‌ నుంచి ఒంటె పాలు

  • In Money
  • January 23, 2019
  • 210 Views
అమూల్‌ నుంచి ఒంటె పాలు

ముంబై:  డెయిరీ దిగ్గజం అమూల్‌ తాజాగా ఒంటె పాలు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అరలీటరు పెట్‌ బాటిల్‌ ధర రూ. 50గా ఉంటుందని సంస్థ తెలిపింది. ముందుగా గుజరాత్‌లోని గాంధీనగర్, అహ్మదాబాద్, కచ్‌ మార్కెట్లలో ఈ పాలను విక్రయిస్తారు. ఫ్రిజ్‌ లో ఉంచితే ఈ పాలు మూడు రోజుల దాకా పాడవకుండా ఉంటాయి.ఇటీవలే ప్రవేశపెట్టిన ఒంటె పాల చాక్లెట్లకు మంచి స్పందన వస్తోందని అమూల్‌ తెలిపింది. ఒంటె పాలు సులభంగా జీర్ణం కావడంతో పాటు మధుమేహ సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరుస్తాయని కంపెనీ తెలిపింది.   

తాజా సమాచారం

Latest Posts

Featured Videos