ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకోవడంతో పాటు దేశాన్ని విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి దేశం మొత్తం ఏకతాటిపై నిల్చుంది.కరోనాపై పోరాటానికి సహకరించాలని ప్రధానమంత్రి,ముఖ్యమంత్రులు పిలుపుల మేరకు ప్రజలు,ఎంతోమంది వ్యాపారవేత్తలు స్వచ్చందంగా వేలు,లక్షలు,వందల కోట్లు విరాళంగా అందించారు ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు.అయితే ఈ జాబితాలో సినీ,క్రీడారంగ ప్రముఖులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు.సినీ రంగం విషయం ప్రస్తావిస్తే కొంతమంది నటులు మినహా ఎవరూ విరాళాలు ప్రకటించలేదు.తెలుగులో స్టార్ హీరోలు మాత్రమే అటు ప్రధానమంత్రి,తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ఇటు చిరంజీవి ఏర్పాటు చేసిన సీసీసీకి విరాళాలు అందించారు.అయితే చాలా మంది స్టార్ దర్శకులు,హాస్యనటులు,ఇతర నటీనటులు ఒక్క రూపాయి కూడా విరాళం ప్రకటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సీసీసీ ఛారిటీకి సాయం అందించేందకు ముందుకు వచ్చారు. సీసీసీకి రూ. 3 లక్షల విరాళం అందజేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే కరోనా పై నేను సైతం అంటూ ముందుకొచ్చిన బ్రహ్మానందంపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బ్రహ్మానందం ఒక రోజు రెండు సీన్లలో నటిస్తేనే ఒకటి నుండి రెండు లక్షల దాకా వసూలు చేస్తాడు… కానీ సహాయం చేయమంటే కేవలం 3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.. తీసుకునేది కొండంత.. సాయం చేసేది గోరంత.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఈ జాబితాలో జక్కన్నగా పేరు గాంచిన రాజమౌళి,విజయ్ దేవరకొండ సైతం ఉన్నారు సాధారణంగా ఏదో ఒక హంగామా చేసి వార్తల్లో ఉండే విజయ్ దేవరకొండ కరోనా బాధితులకు సహాయం అందించే విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. తాపీగా కర్చీఫ్ కట్టుకోండి అని.. పైసా ఖర్చులేని రుమాలు సందేశం ఇచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో నంబర్ వన్ డైరెక్టర్ అని కీర్తింపబడుతున్న రాజమౌళి నిర్మాత దానయ్య తో కలిసి 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చానని సోషల్ మీడియాలో ప్రకటించడం తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. భారీగా సంపాదించే డైరెక్టర్ నుంచి ఇలాంటి నామమాత్రపు విరాళం ఎవరూ ఊహించలేదు. కొందరైతే ఈ విరాళం పూర్తిగా దానయ్యే ప్రకటించి ఉంటారని.. రాజమౌళి తన పేరు కూడా జోడించారని ధ్వజమెత్తుతున్నారు.ఇక రౌడీ గారి సంగతి కూడా సరేసరి. పుట్టినరోజుకు హిమక్రీములు పంచ డం.. పబ్లిసిటీ దంచుకోవడం కాదు.. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజలకు తోడుగా ఉండాలంటూ నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. ఇక హీరోయిన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మందిచి.ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క రూపాయి ప్రకటించకపోవడం గమనార్హం.ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోలు,నటీనటులు సైతం ఏం తక్కువ తినలేదు.వెండితెరపై దేశభక్తి,నీతి,న్యాయం అంటూ పెద్ద పెద్ద డైలాలుగు వల్లె వేసే ఖాన్‌లు(సల్మాన్ ఖాన్ మినహా)ఏ ఒక్కరు ఒక్క రూపాయి విరాళంగా ప్రకటించలేదు.అక్కడి హీరోయిన్లు సైతం ఇదే ధోరణితో ఉండడం గమనార్హం..