కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమేసే ఉద్దేశంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రజల జనజీవనం స్తంభించింది. భారత్‌తో పాటు ప్రపంచంలోని 95శాతం దేశాలు లాక్‌డౌన్‌కు మొగ్గుచూపడంతో ప్రపంచ ఆర్థిక పరిస్థితి మొత్తం తలకిందులైంది.ఇక లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ సైతం తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో ఒకటి.తెలుగు చిత్ర పరిశ్రమపై సైతం లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది.షూటింగులు ఆగిపోయి,కొత్త షూటింగులు లేక అసలు చిత్ర కార్యకలాపాలు మొత్తం పూర్తిగా నిలిచిపోయాయి.దీనివల్ల హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలు,స్టార్ నటీనటులకు ఇబ్బంది లేకపోయినా చిన్నచితకా పాత్రలు వేస్తూ కాలం వెళ్లదీసే నటీనటులు,చిత్ర పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు ఆకలితో అలమటించే పరిస్థితులు తలెత్తాయి.ఇది గమనించిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటు చేసి కార్మికుల కోసం సీని పరిశ్రమ నటీనటుల నుంచి విరాళాలు సేకరణకు శ్రీకారం చుట్టారు.స్టార్ హీరోలు కొంతమంది నటులు చారిటీకి భారీగానే విరాళాలు ఇచ్చినా చాలా మంది ఛారిటీకి విరాళాలు ఇవ్వడానికి ఇసుమంతైనా ఆసక్తి చూపడం లేదు. సినిమాలు తీసి కోట్లు కూడబెట్టుకున్న సినీ ప్రముఖులు ఇప్పుడు రూపాయి విదిల్చికపోవడంపై చిరంజీవి సీరియస్ అయ్యారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత సంపాదించి ముష్టిగా విరాళం ఇచ్చిన వారిని.. అస్సలు ఇవ్వని వారికి ఫోన్ చేసి చిరంజీవి వాయించేస్తున్నారట.. సినీ కార్మికుల కోసం విరాళాలు పోగు చేస్తున్న చిరంజీవి ఈ విషయంలో స్వయంగా స్టెప్ తీసుకొని సినీ కార్మికుల కడుపు నింపుతున్నారు. ఈ కోవలోనే సంపాదించినా సాయం చేయని వారికి ఫోన్ చేసి మరీ వాయించేసి సాయాన్ని వసూలు చేస్తున్నారు.సినిమాలు ఆగిపోయి.. షూటింగ్స్ నిలిచిపోయి సినీ కార్మికులంతా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ మేరకు చిరంజీవి ‘కరోనా క్రైసిస్ చారిటీ’ సంస్థను స్థాపించి 6 కోట్ల విరాళాలు సేకరించారు. వాటిని సినీ కార్మికుల అవసరాలకు వినియోగిస్తున్నారు.అయితే దీనికి విరాళం ఇవ్వడానికి కొందరు నటీనటులకు ఇష్టం లేదట.. ముందుకు రావడం లేదట..మొహమాటంగా తక్కువ విరాళం ఇస్తున్నారట. దీంతో స్వయంగా చిరంజీవి ఫోన్ చేసి వెంటపడి మరీ వసూలు చేస్తున్నారట.. సంపాదన ఉన్నా ఇవ్వని వారి వైఖరి చిరుకు నచ్చలేదట.దీంతో ఇక నుంచి శాశ్వత ఫండ్ ఏర్పాటు చేసి అందరి దగ్గర వసూలు చేసి వాటిని సంక్షేమం కోసం ఖర్చు చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్టు సమాచారం. చిరంజీవి చూపిస్తున్న చొరవకు సినీ కార్మికుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.ఇక ప్రతి సినిమాకు కోట్లల్లో,లక్షల్లో పారితోషం తీసుకుంటున్న కొంతమంది స్టార్ నటులు,దర్శకులు ఒక్క రూపాయి కూడా విరాళం ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.