తెలుగు చిత్ర పరిశ్రమలో కెరటంలా దూసుకువచ్చి అంతే వేగంగా కిందకు పడిపోయి పరిస్థితుల కారణంగా ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యకు పాల్పడి ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఉదయ్‌కిరణ్ జ్ఞాపకాలు,ఘటనలు తరచూ మీడియాలో కనిపిస్తున్నాయి,వినిపిస్తున్నాయి.తాజాగా ఉదయ్ కిరణ్ సోదరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వయసులోనే సూపర్ స్టార్ రేంజ్ కు వెళ్లి ఎగసి పడ్డ అల మాదిరిగా కిందికి పడిపోయిన ఉదయ్ కిరణ్ ఆర్థిక పరిస్థితులు.. సినిమాల్లో ఆఫర్లు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్న విషయం తెల్సిందే. అయితే మస్కట్ లో సెటిల్ అయిన ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఇన్నాళ్ల తర్వాత సోదరుడు ఉదయ్ కిరణ్ ఆస్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉదయ్ కిరణ్ ఆర్థిక పరిస్థితుల కారణంగా చనిపోయినట్లుగా వచ్చిన వార్తలను ఆమె కొట్టి పారేశారు. మా అమ్మ నా సోదరుడికి నాలుగు కేజీల బంగారం దాదాపుగా 100 కేజీల వెండిని ఇచ్చిందని చాలా ఖరీదైన ప్రాంతంలో మూడు ఆస్తులు కూడా ఉదయ్ కిరణ్ కు ఉన్నాయంటూ శ్రీదేవి చెప్పుకొచ్చారు. అంత ఆస్తి ఉన్న ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోతాడని ఆమె ప్రశ్నిస్తుంది. అతడు ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోలేదు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఉదయ్ కిరణ్ ఆర్థిక పరమైన ఇబ్బందులు పడలేదని చెప్పారు.ఉదయ్ కిరణ్ మరణం పై అనుమానాలు.. ప్రశ్నలు ఉన్నాయంటూ శ్రీదేవి వ్యాఖ్యలు చేశారు. సోదరుడు చనిపోయిన తర్వాత అతడి భార్య విషిత మా ఫ్యామిలీ తో పూర్తిగా దూరం అయ్యింది. ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా కూడా కనీసం కాంటాక్ట్ అవ్వడం లేదు. ఉదయ్ చనిపోయిన తర్వాత అతడి ఆస్తి అంతా కూడా విషిత తీసుకుందని బంగారం.. వెండితో పాటు ప్రాపర్టీస్ ను కూడా తీసుకుందని పేర్కొంది.ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించిన ప్రతి సారి ఏదో ఒక కారణం చెప్పి దొరకడం లేదని విషిత ప్రవర్తనతో మాకు అనుమానాలు కలుగుతున్నాయని అనేక ప్రశ్నలు మాకు తలెత్తుతున్నాయంటూ శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత శ్రీదేవి ఇలాంటి వ్యాఖ్యలతో మీడియా ముందుకు రావడంతో మరోసారి ఆయన మరణ వార్తలు మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.