దొంగ పాత్రలో పవన్‌..

  • In Film
  • April 10, 2020
  • 185 Views
దొంగ పాత్రలో పవన్‌..

రాజకీయల నుంచి తాత్కాలింగా విరామం తీసుకొని సినిమాలపై దృష్టి సారించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో సైతం నటించడానికి సిద్ధమయ్యాడు.క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో దొంగ పాత్రలో పవన్‌ నటించనున్నాడని తెలుస్తోంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో కథ నడుస్తుందనేది తాజా సమాచారం. ఇక పవన్ కనిపించేది కూడా సాధారణమైన దొంగగా కాదు .. కోహినూర్ వజ్రాన్ని కాజేయడానికి ప్రయత్నించే ఘరానా దొంగగా నటిస్తున్నాడని తెలుస్తోంది.కథ అంతా కూడా కోహినూర్ వజ్రం చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించనున్నాడు. సినిమాలో ఒక కథానాయికగా జాక్విలిన్ ను తీసుకున్నారు. ఔరంగజేబు సోదరి పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. పవన్ .. జాక్విలిన్ కి మధ్య ట్రాక్ ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. సినిమాకివిరూపాక్షఅనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos