వారే నిజమైన దేశ భక్తులు

వారే నిజమైన దేశ భక్తులు

న్యూ ఢిల్లీ: కరోనా పై పోరులో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఆశా, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు నిజమైన దేశ భక్తులని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొనియాడారు. ఈ విపత్కర పరస్థితుల్లో సమాజాన్ని కాపాడుకునేందుకు ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వైరస్ కంటే భయం, అసత్యమే ప్రమాదంగా పరిణమించిన వేళ ప్రజల్లో అవగాహన కల్పించడంలో వీరు కీలక పాత్ర పోషి స్తున్నారని . ప్రాణాల్ని పణంగా పెట్టి, అత్యంత నిబద్ధతతో కొవిడ్-19పై పోరును కొనసాగిస్తున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం వారంతా చేస్తున్న త్యాగాలకు దేశం ఎంతో రుణపడి ఉందని వ్యాఖ్యానించారు. వారి సేవల్ని ఆదర్శప్రాయమైనవిగా అభివర్ణించారు. వీటికి గుర్తింపుగా ఈ సంక్షోభం ముగిసిన తర్వాత వారి పని పరిస్థితుల్లో సానుకూల మార్పు రావాలని ఆకాంక్షించారు. ఈ పోరులో భాగమైన ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా నన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos