అరటిరైతులకు ఆనంద్‌ మహీంద్ర చేయూత..

అరటిరైతులకు ఆనంద్‌ మహీంద్ర చేయూత..

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ కొన్ని ఫోటోలు,వీడియోలపై తనదైన శైలిలో స్పందిస్తూ వీలైతే తన సంస్థ ద్వారా ఆదుకోవడానికి ముందుకు వచ్చే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర మరోసారి తన దాతృత్వాన్ని,మంచి మనసును చాటుకున్నారు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు గుర్తించిన విశ్రాంత ప్రాతికేయుడు రామనాథ్‌ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రకు ఓ మెయిల్‌ పంపించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాగు చేసిన అరటిపంటను విక్రయించడం సాధ్యంకాక అరటిరైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు.మెయిల్‌కు వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్రా తమ ప్లాంట్లు,కార్యాలయాల్లోని క్యాంటీన్లలో సిబ్బందికి ప్లేట్లలో బదులు అరిటాకుల్లో భోజనం వడ్డించాలని, మేరకు రైతుల నుంచి ఆకులను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆలోచన కలిగేలా చేసినందుకు పద్మా రామ్ నాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఆపై తాను చేసిన చిరు సాయాన్ని ఫొటోలతో సహా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తమ క్యాంటీన్లలో అరిటాకు భోజనం లభిస్తోందని తెలిపారు. ఆనంద్ ట్వీట్ ను వేలాది మంది లైక్ చేశారు. ఆయన సేవా తత్పరత అమోఘమని కొనియాడుతున్నారు. ఇక భోజనాలు చేస్తున్న సమయంలోనూ ఉద్యోగులు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండటంతో ఫోటోలు వైరల్ అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos