మందకొడిగా మార్కెట్లు..!

  • In Money
  • January 23, 2019
  • 961 Views
మందకొడిగా మార్కెట్లు..!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం మందకొడిగా ట్రేడవుతున్నాయి. ఉదయం 9.47 గంటల సమయంలో సెన్సెక్స్‌ 10 పాయింట్ల నష్టంతో 36,433 వద్ద, నిఫ్టీ 2.95 పాయింట్ల లాభంతో 10,926 వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌ షేరు 1శాతం నష్టంతో ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్‌ సూచీ 42 పాయింట్ల లాభంతో , స్మాల్‌ క్యాప్‌ సూచీ 39 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. మరో పక్క రూపాయి కూడా డాలర్‌తో పోలిస్తే 27 పైసలు కోలుకొని రూ.71.17 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు రూపాయిని ప్రభావితం చేశాయి. నేడు దాదాపు 50 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో ఐటీసీ, గ్లోబల్‌ ఏవియేషన్స్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, విజయాబ్యాంక్‌ వంటి సంస్థలు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos