హోసూరు: కరోనా నివారణకు మందులు పిచికారి చేయటం గురించి గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు వైరస్ ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రతి గ్రామాలలో క్రిమి సంహారక మందులు పిచికారి చేయటం అనివార్యమని అధికారులు అప్రమత్తం చేసారు. హోసూర్ యూనియన్లోని ఇచ్చంగూరు, చొక్క నాథపురం తదితర గ్రామాలలో క్రిమిసంహారక మందులను పిచికారి చేయడమేకాక గ్రామస్తులకు ముసుగుల్ని( మాస్క్ లను) ఉచితంగా అందించారు. హోసూర్ యూనియన్ చైర్పర్సన్ శశి వెంకట స్వామి ఇచ్చంగూరు పంచాయతీల్లోని గ్రామాల్లో గడపగడపకు వెళ్లి కరపత్రాలు పంచారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కల్పించారు . పంచాయతీలోని అన్ని గ్రామాల్లో క్రిమిసంహారక మందులను పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో శశి వెంకట స్వామి తో పాటు యూనియన్ కార్యాలయ సిబ్బంది, అధికారులు ఉన్నారు.