ఆటో స్ప్రేయర్‌ను ప్రారంభించిన లావణ్య హేమనాథ్

ఆటో స్ప్రేయర్‌ను ప్రారంభించిన లావణ్య హేమనాథ్

హొసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరిలో కరోనాను నిరోధించడంలో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా కూరగాయల మార్కెట్ వద్ద ఆటో క్రిమిసంహారక స్ప్రేయర్‌ను యూనియన్ చైర్పర్సన్ లావణ్య హేమనాథ్ ప్రారంభించారు. సూలగిరిలో కూరగాయల మార్కెట్ పట్టణ నడిబొడ్డున ఉండేది. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా మార్కెట్‌ను సూలగిరి బస్టాండుకు తరలించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ మార్కెట్‌కు సూలగిరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామస్థులు కూడా వచ్చి కూరగాయలు కొనుక్కొని వెళుతున్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజల వల్ల కరోనా వైరస్ ప్రబలే ప్రమాదం ఉండవచ్చనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్ సమీపంలో క్రిమి సంహారక మందులు పిచికారీ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలపై ప్రవేశ ద్వారం వద్ద మందు పిచికారి అవుతుంది. రోటరీ క్లబ్ సహాయంతో ఈ యంత్రాన్ని నెలకొల్పినట్లు చైర్ పర్సన్ లావణ్య హేమనాథ్ తెలిపారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలపై మందులు పిచికారి చేస్తే, కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు రోటరీ క్లబ్ నిర్వాహకులు, ఏడీఎంకే పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos