వేలూరు: రాణి పేట జిల్లా పనపాక్కం సమీపంలోని పన్నియార గ్రామంలో రోజు రోజుకూ కాకుల మృతి పెరుగుతోంది. ఇవి ఆకలితో చనిపోతున్నాయా లేదా వ్యాధి బారిన పడి చనిపోతున్నాయా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. అధికార్లు రంగంలోకి దిగారు. పన్నియూర్ గ్రామంలో 800 మందికి పైగా ప్రజలు జీవిస్తు న్నారు. గత 1వ తేది సాయంత్రం 5 గంటల కు పక్కగ్రామం కులత్తుమేడులో అకస్మాత్తుగా పదికి పైగా కాకులు మృతి చెందాయి. కరోనా వల్ల ప్రజలు ఎవరూ బయటకు రాక పోవడంతో ఆహారం లేక కాకులు చనిపోయి ఉండవచ్చని భావించారు. మరుసటి రోజు సాయంత్రం అదే ప్రాంతంలోని గృహాలపై నీరసంగా వాలిన కాకులు, అకస్మాత్తుగా ఒకదాని తర్వాత ఒకటి పెద్దసంఖ్యలో మృతి చెందాయి.