న్యూఢిల్లీ: కరోనా తీవ్రత పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4067కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 109మంది మరణించారు. 3666 మంది చికిత్స పొందుతున్నారు. మరో 292మంది కోలుకున్నారు. గత వారంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా పీడితుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 62కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 258కి చేరింది. వీరిలో ముగ్గురు మరణించారు.