నితీశ్ రాజీనామా చేయాలి

నితీశ్ రాజీనామా చేయాలి

పట్నా : కరోనా వైరస్ విజృంభించిన దశలో వలస కార్మికులను రక్షించడంలో దారుణంగా విఫలమైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం ట్విట్టర్లో డిమాండు చేసారు. ‘ప్రభుత్వ వైఫల్యాన్ని చూపే హృదయ విదారకర ఘటన – లాక్డౌన్ను ఎదుర్కొవడంలో నితీష్ తీవ్రంగా విఫలమయ్యారు. అంతిమంగా పొట్టకూటి కోసం దేశ నలుమూలల నుంచి బిహార్కు వచ్చిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన వైఫల్యాలను అంగీకరించి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాల’ని డిమాండ్ చేశారు.వివిధ ప్రాంతాలను నుంచి బిహార్కు వలస వచ్చిన కార్మికులపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. ప్రజలెవ్వరూ రాష్ట్రాల సరిహద్దులు దాటరాదన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్మికులందరినీ క్వారెంటెన్ కేంద్రాలకు పంపించారు. కార్మికులకు నివాసం కల్పించిన ఓ వీడియోను ప్రశాంత్ కిషోర్ ట్విటర్లో సందేశానికి జత పరిచారు. అందులో వాళ్లంతా ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతవుతున్నారు. ప్రభుత్వం నుంచి తామకు ఏమీ అవసరంలేదని, తమ స్వస్థలాలకు పంపిస్తే చాలని విలపిస్తున్నారు. కనీన సామాజిక దూరం పాటించలన్న నిబంధనలు ఉల్లంఘించి… అందరినీ ఒకే గదిలో బందించినట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. లాక్డౌన్లో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సంక్షోభాన్ని కేంద్రం సరైన రీతిలో ఎదుర్కోలేపోయిందని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos