‘తిరుమల’లో విలీనం కానున్న ప్రభాత్‌

  • In Money
  • January 22, 2019
  • 922 Views
‘తిరుమల’లో విలీనం  కానున్న ప్రభాత్‌

ముంబయి: ముంబయికి చెందిన ప్రభాత్‌ డైయిరీ విభాగం తిరుమల  మిల్క్‌ ప్రొడక్ట్స్‌లో విలీనం కానుంది.  ఈ విషయాన్ని ప్రభాత్‌  స్టాక్‌ ఎక్స్ఛేంజికి తెలియజేసింది.  తిరుమల మిల్క్‌ మాతృసంస్థ లాక్టలీస్‌ తాజాగా ప్రభాత్‌ డెయిరీలో వాటాలను కొనుగోలు చేయనుంది.  ఈ డీల్‌ విలువ రూ.1,700  కోట్లుగా అంచనా వేశారు.  2017-18లో ప్రభాత్‌ డెయిరీ విక్రయాల విలువ రూ.1,554 కోట్లుగా నమోదైంది. ఈ డీల్‌ పూర్తికావడానికి పట్టే సమయాన్ని మాత్రం ప్రభాత్‌ డెయిరీ వెల్లడించలేదు. ఈ ఒప్పందానికి సంబంధించిన అనుమతులు రావాల్సి ఉంది.సోమవారం ట్రేడింగ్‌ ముగిసేనాటికి ప్రభాత్‌ డెయిరీ మార్కెట్‌ విలువను రూ. 909కోట్లుగా నిర్ణయించారు. ఈ డీల్‌కు కొటాక్‌ మహీంద్రా క్యాపిటల్‌ సలహాదారుగా వ్యవహరించింది. ప్రభాత్‌కు డెయిరీ వ్యాపారంతోపాటు అనుంబంధ సంస్థ అయిన సన్‌ఫ్రెష్‌ ఆగ్రోలో వాటాలను  విక్రయించేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos