గ్రోంజీ :‘కరోనా వైరస్ గురించి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనిషి ఏదో ఒక రోజు మరణించాల్సిందే. మీ సమయానికి ముందే మరణించాలని ప్రయత్నిండం మానండ’ని చెచన్యా దేశ అధినేత రందాన్ కదిరోవ్ తమ దేశ ప్రజలకు హితవు పలికారు.‘ప్రజలు తమ చేతుల్లో లేని దాని గురించి బాధపడరాదు. సంప్రదాయ వైద్య చిట్కాలను విడిచి పెట్ట వద్దు. చైనా నుంచి వ్యాపించిన వైరస్ పై ఆందోళ నతో ప్రజలకు కంటిమీద కునుకు లేదు. అది తమకు సోకితే తాము మరణిస్తామని ప్రజలు ఆందోళన చెందుతున్నార’ని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి. నీటిలో నిమ్మరసం, తేనె కలుపు కుని తాగండి. వెల్లుల్లి అధికంగా తినండ’ని సూచించారు. చెచెన్యాలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు.