హైదరాబాదు: విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రీకరణ ఆరంభం కానుంది. రజనీకాంత్ నాయకుడుగా మురుగదాస్ తెర కెక్కించిన దర్బార్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా మురుగదాస్ పై గల నమ్మకంతో విజయ్ ఆయన దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. త్వరలో మరిన్న వివరాలు బహిర్గతం కానున్నాయి.