ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఊగిసలాట ధోరణిలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.33గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 5 పాయింట్లు లాభపడి 30,584 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 8,979 వద్ద ఉన్నాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 73.96 వద్ద దాఖలైంది. యెస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్స్, సన్ఫార్మా, ఇన్ఫోసిస్, వేదాంత లాభాల గడించాయి. యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, గెయిల్ ఇండియా షేర్లు నష్ట పోయాయి.