న్యూ ఢిల్లీ : ఉరి నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబరు 16న తాను దిల్లీలోనే లేనందున తనకు విధించిన ఉరి శిక్షను రద్దుచేయాలని దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ తాజాగా దిల్లీ కోర్టులో అడిషనల్ సెషన్స్ న్యాయ మూర్తి ధర్మేంద్ర రాణాకు విన్నవించాడు. డిసెంబర్ 17, 2012న రాజస్థాన్ నుంచి పోలీసులు తనని దిల్లీ తీసుకొచ్చారని, తిహాడ్ చెరసాల్లో తనను చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపించాడు. దరిమిలా తనకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని కోరాడు. ఈ నెల 20న తెల్లవారు జాము 5:30 గంటలకు ఉరి తీయాలని మార్చి 5న న్యాయస్థానం ఉత్తర్వుల్ని జారీ చేసింది.