ఇస్కాన్ గుడిలో శానిటైజర్‌కు బదులుగా గోమూత్రం

ఇస్కాన్ గుడిలో శానిటైజర్‌కు బదులుగా గోమూత్రం

ముంబై : ఇక్కడి జూహూ ఇస్కాన్ మందిరంలో శానిటైజర్కు బదులుగా భక్తులకు గోమూత్రం ఇచ్చారు. ‘చేతులను పరి శుభ్రం చేసుకు నేందుకు ఇచ్చిన గోమూత్రంలో బాక్టీరియాను ఎదుర్కొనే గుణం ఉంటుంద’ని ఆలయ నిర్వాహకులు వివరించారు.‘నా స్నేహితు డొకరు నన్ను ఇస్కాన్ టెంపుల్ లోపలున్న గోవిందా రెస్టారెంట్కు తీసుకు వెళ్లాడు. తనిఖీలు చేసిన తరువాత చేతులను చూపిం చాలని చెప్పి, ఏదో స్ప్రే చేశారు. అది ఎంతో దుర్వాసనతో ఉన్నట్లు అనిపించింది. దీంతో అది ఏమిటని వారిని అడగగా, ‘గోమూత్రం’ అని చెప్పారు. ఇలా ఎవరితోనూ చెప్పకుండా చేతులలో ఎందుకు గోమూత్రం స్ప్రే చేస్తున్నారు? అని అడిగాను. దీనికి సమాధానంగా వారు దీనిని కొంతమంది తాగు తుంటారు కూడా అని చెప్పారు. ఇలా గోమూత్రంలో చేతులు కడుక్కోవడం నాకు ఇష్టం లేదు.నా దగ్గర శానిటైజర్ ఎప్పుడూ ఉంటుంది. నిజానికి నేను ఆలయానికి వెళ్లలేదు. లంచ్ కోసం అక్కడి రెస్టారెంట్కు వెళ్లాను. అయితే అక్కడ నా భావాలకు విరుద్ధంగా జరిగింది’ రాజూ నాయర్ అనే వ్యక్తి ఇస్కాన్ గుడిలో తనకు ఎదురైన అనుభవాన్ని ట్వీట్ చేసారు.‘మందిరంలో ప్రతీ ప్రవేశద్వారం వద్ద శాని టైజర్ ఏర్పాటు చేశాం. అలాగే గోవిందా రెస్టారెంట్ దగ్గర కూడా శానిటైజర్ ఉంచాం. అయిపోవటంతో గో మూత్రాన్ని శానిటైజర్ మాదిరిగా వినియోగించామని ఆలయ ప్రతినిధి దేవీ దాసీ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos