నైతిక రాజకీయాలే నిలుస్తాయి

నైతిక రాజకీయాలే నిలుస్తాయి

రాజమండ్రి:నైతిక రాజకీయాలకు ఇంకా కాలం చెల్లలేదని నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఇక్కడ జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో నమ్మకంగా చెప్పారు.’నాతో ఏకీభవించే వారు లేరు. కులాలు కలుపుకుని రాజకీయాలు చేద్దామని కొందరు వచ్చారు. కానీ, నేను ఆ రోజున కేవలం యువతను నమ్మాను. నాకు తెలుసు పార్టీలోకి వచ్చినోళ్లు మళ్లీ పారిపోతారని తెలుసు. ఒక్క అరుపు అరిస్తే పారిపోతారు. అంతటి పిరికి వారు అయిపోయారు ఈ సమాజంలో. నాకు అలాంటి వారు అవసరం లేదు. పిడుగు మీద పడ్డా, ఫిరంగి వచ్చి తగిలినా గుండె ధైర్యం చూపుతూ నిలబడగలిగే వారు కావాలి. రాజమండ్రిలో కవాతు చేసినప్పుడు పది లక్షల మంది వచ్చారు. అయితే, వారు ఓటు ఎవరికి వేశారు. నేరాలకు పాల్పడేవారికకి వేసారు. ఓటమిని అంగీకరించడం ఎంత కష్టమో నన్ను అడగండి చెబుతాను. ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం కావాలి. ఓటమిని అంగీకరించి నిలబడాలి. నేరస్తులను ప్రోత్సహించని రాజకీయాలు చేయాలి. ఇన్ని నీతులతో రాజాకీయాలు చేస్తే నిలబడగలమా? అని కొందరు భావిస్తుంటారు. కచ్చితంగా నిలబడతాం’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos