నా కిష్టమైన దుస్తులు వేసుకుంటా

నా కిష్టమైన దుస్తులు వేసుకుంటా

ముంబై : ‘నా కిష్టమైన దుస్తులు వేసుకుంటా.నచ్చినట్లు ఉంటా. మీకేంట?’ని నటి పత్రలేఖ ప్రశ్నించారు. గత వారం నెట్ఫ్లిక్ సినిమా ‘గిల్టి’ ప్రత్యేక ప్రదర్శనలో ఆమె జాకెట్ ఉన్న బ్లాక్ క్రాప్ టాప్, జీన్స్ ధరించారు. దాన్ని కొందరు తప్పుపట్టారు. నటి ‘చీప్’గా కనిపి స్తోందని వ్యాఖ్యానించారు. తనను తప్పుపట్టిన వారిపై ఆమె విరుచుకు పడ్డారు.‘ఈ దుస్తుల్ని నేను సినిమా స్క్రీనింగ్కు ధరించా. ఫ్యాషన్ గురించి తెలిసిన కొందరు మెచ్చుకున్నారు, వారికి ధన్యవాదాలు. కానీ చాలా మంది ప్రతికూలంగా కామెంట్లు చేశారు. నేను షాక్ అయ్యా.. ప్రజలు ఓ వ్యక్తిని టార్గెట్ చేసి, ఎందుకు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos