భోపాల్:మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై తాను మాట్లాడలేనని భాజపా సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆసక్తి తమకు లేదని తొలి రోజు నుంచే తాను చెబుతున్నట్లు స్పష్టీకరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని విలాస విడిదిలో ఉన్నారు. ఆయన భాజపాలో చేరబోతున్నారని, మంత్రి పదవి కూడా ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలు వెలువడ్డాయి.