తిరుమల: జలుబు, దగ్గుతో బాధపడే వారు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి రాకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సోమ వారం భక్తులకు విన్నవించింది. జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు దర్శనానికి వస్తే రద్దీ వల్ల వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని వివరించింది. స్వామి దర్శనార్థం వచ్చిన భక్తుల్లో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు తరలించాలని నిర్ణయించింది. భక్తులు శానిటైజర్లు,ముసుగులతో రావాలని సూచించింది.