ముంబై : కరోనా వైరస్ నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు విమానాల క్యాన్సిలేషన్, రీషెడ్యూలింగ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 12 నుంచి మార్చి 31 మధ్య జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బుక్ చేసుకున్న టికెట్‌లను రద్దు చేసుకున్నా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని పేర్కొంది. ఆయా తేదీల మధ్య ప్రయాణ తేదీల మార్పునకూ ఎలాంటి ఛార్జీలు విధించబోమని తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.