హైదరాబాద్ : సీఏఏ, ఎన్ఆర్సీల గురించి రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు విన్నవించారు. శనివారం దిగువ సభలో ప్రసంగించారు. ‘వీటిపై పౌరులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఆందో ళనలు వ్యక్తమవుతున్నాయి. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నాయి. వీటి గురించి ఒక రోజంతా సభలో చర్చించి తీరుతాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. ఇక సామన్య ప్రజలకు ఏం ఉంటుంది. ఇలాంటి చట్టాలపై దేశ వ్యాప్తంగా సుధీర్ఘ చర్చ జరగాల’న్నారు.