ముంబై: మెన్స్ డేని ప్రత్యేకంగా జరుపుకోము. మరి ఉమెన్స్ డే ఎందుకని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రశ్నించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ప్రసంగించారు. ‘ ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న మహిళలను గౌరవించడం నేర్చు కోవాలలి. అదే నిజమైన మహిళా దినోత్సవమని తాను భావిస్తాన’ని పేర్కొన్నారు. ‘దినోత్సవం ఆలోచనను నేను పెద్దగా నమ్మను. ఉమెన్స్ డేని కేవలం ఒక్కరోజు జరుపుకోవడం ఏంటి? ఆ స్ఫూర్తిని ప్రతిరోజూ జరుపుకోవాలి. ఈ ఏడాది హోలీ రోజున కూడా తనకు షూటింగ్ ఉంది. నేను హోలీ ఆడటం పదో తరగతిలోనే ఆపేశాను. సంబరం కోసం చేసుకునే హోలీ వల్ల నీళ్లు వృథా అవుతాయన్న అవగాహన వచ్చింది అప్పుడే. దీంతో కేవలం రంగులతోనే ఆడే వాళ్లం. ప్రస్తుతం అది కూడా తగ్గించేశామ’ని చెప్పింది.