న్యూ ఢిల్లీ:ఈశాన్య ఢిల్లీలో గత వారం సంభవించిన హింసాత్మక ఘటనలను అడ్డుకోవటంలో దారుణంగా విఫలమైనవారు వెంటనే తమ పద వులకు రాజీనామా చేయాలని నటుడు రజనీకాంత్ డిమాండు చేసారు. పలువురు ముస్లిం ప్రముఖులతో భేటీ అయిన తర్వాత ఈ మేరకు ట్వీట్ చేసారు.దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతి, సామరస్య స్థాపనకు తన వంతు బాద్యతను నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో తాను ఏకీభవించినట్లు చెప్పారు.