ముంబై:స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్ 559 పాయింట్లు పెరిగి 38,856 వద్ద, నిఫ్టీ 167 పాయింట్లు లాభపడి 11,368 వద్ద ఉన్నాయి.సెన్సెక్స్ ఒక దశలో 750 సాయింట్లకు పైగా పెరిగింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.58 వద్ద దాఖలైంది. జీ ఎంటర్టైన్మెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, వేదాంత, ఐఓసీ షేర్లు లాభాల్ని గడించాయి. కొటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం నష్టాల పాలయ్యాయి.