టవల్‌ మింగిన కొండ చిలువ…ఇలా బయటకు తీశారు…

పాపం ఆకలేసిందో, ఏమో ఓ కొండ చిలువ టవల్‌ను మింగేసింది. తర్వాత దాని అవస్థ వర్ణనాతీతం. దాని యజమాని వెంటనే దానిని పశు వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు. వైద్యులు చాలా కష్టపడి దాని పొట్టలోంచి టవల్‌ను బయటకు లాగారు. ఆస్ట్రేలియాకు చెందిన సాశ్‌ అనే వ్యక్తి మోంటీ అనే కొండ చిలువనుపెంచుకుంటున్నారు. ఒక రోజు ఆ యజమాని తన మోంటీని తీసుకొని బీచ్‌కు వెళ్లాడు. కొండచిలువకు ఆకలైతే ఎదురుగా ఏది ఉన్నా సరే గుటుక్కుమనిపిస్తుంది కదా..! ఇదీ అదే పని చేసింది. అక్కడున్న ఓ బీచ్‌ టవల్‌ను మింగేసింది. సాయంత్రం పూట స్నాక్స్‌ తినే సమయంలో ఆ పాము అవస్థలు పడుతుండటాన్ని గమనించిన యజమాని దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు చేసిన వైద్యులు దాని కడుపులో జీర్ణం కాని ఒక భారీ పదార్థం ఉందని గుర్తించారు. నానా అవస్థలు పడి పాము నోటి ద్వారా విజయవంతంగా బీచ్‌ టవల్‌ను బయటికిలాగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos