మహిళల టీ20 ప్రపంచ కప్పు : ఇండియా మరో విజయం

  • In Sports
  • February 29, 2020
  • 172 Views
మహిళల టీ20 ప్రపంచ కప్పు : ఇండియా మరో విజయం

మెల్‌బోర్న్ : మహిళల టీ20 ప్రపంచ కప్పులో భారత జట్టు మరో విజయం సొంతం చేసుకుంది. శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. 34 బంతుల్లో 47 పరుగులు చేసిన షఫాలీ వర్మ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. 33 పరుగులు చేసిన ఏసీ జయంగాని శ్రీలంక జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు వికెట్లు తీసుకోగా, గైక్వాడ్ రెండు వికెట్లు, డీబీ శర్మ, ఎస్ పాండే, పూనమ్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. గ్రూప్ ఏలో ఉన్న టీమిండియా ఈ విజయంతో 8 పాయింట్ల సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos