రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

  • In Local
  • January 22, 2019
  • 1056 Views
రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం సృష్టించింది. విశాఖ జిల్లా నక్కపల్లి అడ్డురోడ్డు సమీపంలో రైలు బ్రేకులు ఒక్కసారిగా పట్టేయడంతో డీ5 బోగీలో పొగలొచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే గుర్తించిన సిబ్బంది రైలును అక్కడే నిలిపివేశారు. మరమ్మతులు చేసిన 25 నిమిషాల తర్వాత రైలు విశాఖకు బయలుదేరింది. విజయవాడలో ఈ ఉదయం 6.05 గంటలకు బయల్దేరిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 12.10 గంటలకు విశాఖ చేరుకోవాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos