మరో సీట్లో అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ!

మరో సీట్లో అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ!

రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కోఅడుగు ముందుకు వేస్తోంది. జగన్ పాదయాత్ర ముగిసిన సమయం నుంచి పలు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అవుతూ ఉన్నారు. ఈ పరంపరలో కదిరి ఎమ్మెల్యే సీటుకు అభ్యర్థిని ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అనంతపురం జిల్లా ఇన్ చార్జిగా ఉన్న మిథున్ రెడ్డి కదిరి అభ్యర్థిగా డాక్టర్ సిద్ధారెడ్డి పేరుని అనౌన్స్ చేశాడు.కదిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అయితే నెగ్గిన అత్తార్ చాంద్ భాషా వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఈ నేపథ్యంలో సిద్ధారెడ్డిని వైసీపీ అక్కడ ఇన్ చార్జిగా ప్రకటించింది. రెండేళ్లకు పై నుంచినే ఇన్ చార్జిగా కొనసాగుతున్న సిద్ధారెడ్డినే ఆ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది. జగన్ ఆదేశానుసారం ఈ ప్రకటన చేస్తున్నట్టుగా మిథున్ రెడ్డి ప్రకటించాడు.ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబీకులు ఎవరైనా పోటీచేయాలని కార్యకర్తలు తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అటు కడప, ఇటు చిత్తూరులతో సరిహద్దును పంచుకునే కదిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఫస్ట్  ఫ్యామిలీకి చెందిన వారెవరైనా పోటీచేస్తే.. అనంతలో పార్టీకి జోష్ వస్తుందని కార్యకర్తలు అంటూ ఉంటారు.అయితే ఈ సారికి సిద్ధారెడ్డినే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది. జగన్ పాదయాత్రకు కదిరిలో జనస్పందన అత్యంత భారీగా కనిపించింది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos