అమూల్యకు మావోయిస్టులతో సంబంధాలు

మైసూరు: నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గురువారం రాత్రి ఇక్కడ జరిగిన సభలో పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించిన యువతి అమూల్య లియోన్కు గతంలో మావోయిస్టులతో సంబంధా లుండేవని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆరోపించారు. శుక్ర వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పారు.‘రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగిం చేలా కొన్ని సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని ఈ ఘటనతో స్పష్టమైంది. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోకపోతే వీటికి అంతమనేదే ఉండదు. అమూ ల్య వెనకాల ఉన్న సంస్థలను దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. ఇక ఆ యువతికి గతంలో మావోయిస్టులతో సంబంధా లున్న ట్లు తెలిసింది. అమూల్యకు శిక్ష పడాల్సిందేనని ఆమె తండ్రే స్వయంగా చెప్పారు.దీంతో అమూల్యకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. ఈ కేసులో ఆమెకు తగిన శిక్ష పడేలా చూస్తాం’ అని తెలిపారు.చిక్క మగళూరులోని అమూల్య నివాసంపై ఇంటిపై కొందరు దుండ గులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దరిమిలా పోలీసులు ఆమె కుటుంబానికి భద్రత కల్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos