‘ కమ్యూనిస్టు ప్రణాళిక ‘ పుస్తక ఆవిష్కరణ

‘ కమ్యూనిస్టు ప్రణాళిక ‘ పుస్తక ఆవిష్కరణ

విజయవాడ:నగరంలోని మార్క్స్, ఏంగెల్స్ విగ్రహాల వద్ద శుక్రవారం కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ కామ్రేడ్ గడ్డం కోటేశ్వరరావు కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాన్ని పరిచయం చేశారు. లక్షా యాభై వేల మందికి కమ్యూనిస్టు ప్రణాళికా సందేశం వెళ్లాలనే ఆశయంతో.లక్షన్నర కాపీలు ఆంధ్ర ప్రదేశ్లో ప్రచురితం కావటం సంతోషంగా ఉందన్నారు.ప్రజాశక్తి సంపాదకులు ఎంవిఎస్.శర్మ మాట్లా డుతూ పాలకవర్గాలు సృష్టిస్తున్న భ్రమలన్నిటినీ పటాపంచలు చేసేందుకు కమ్యూనిస్టు ప్రణాళిక ప్రధానమైన ఆయుధంగా దోహద పడుతుందని చెప్పారు. ‘సోషలిజం కోసం నాటిన విప్లవ విత్తనాలం మేము. ఓ వసంత సుప్రభాతాన ప్రపంచ వ్యాప్తంగా మొలకలెత్తుతాం’ అని యుగో స్లావియా కమ్యూనిస్టు విప్లవ కారుడు జూలియస్ ఫూజిక్ చెప్పిన మాటలను గుర్తు చేశారు.ఈ పుస్తకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మొలకల్ని మొలకెత్తించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. పోరాడితే పోయేదేమి లేదు.బానిస సంకెళ్ళు తప్ప. ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అంటూ గర్జించిన కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడి ఫిబ్రవరి 21 కి 172 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos